కరీంనగర్, నిఘా న్యూస్:విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల వల్ల ఉల్లాసం కలడమే కాకుండా విజయాల పట్ల ఆసక్తి పెరుగుతుందని డాక్టర్ ఎల్.రాజభాస్కర్ రెడ్డి అన్నారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి గారితో కలసి స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్ మైదానంలో కౌస్తూబం పేరుతో నిర్వహింపబడిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు వారు ప్రాంగణంలో ఏర్పాటుచేసినటువంటి చదువుల స్వరూపిణి సరస్వతిమాత విగ్రహానికి పూలమాలవేసి జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు.

ప్రతి విద్యార్థి తల్లితండ్రుల మాటలను అనుసరించి విజయాలు సాధించి వారికి సంతృప్తిపర్చాలని తద్వారా సమాజంలో తగిన గుర్తింపు లభిస్తూందని చెప్పారు. నేడు సమాజంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలుపుతూ వాటిని అనుసరిస్తూ ఉన్నత శిఖరాలను అందుకోవాలని చెప్పారు. తరగతి గదుల్లో నేర్చుకున్న విషయాలను ఎప్పటికప్పుడు సాధన చేస్తూ ఉత్తమంగా ఉండాలని చెప్పారు. విశ్వంలో చోటుచేసుకునే పలు విధానలను తెలుసుకొని ముందంజలో నిల్వాలని సూచించారు. ప్రతి విషయాన్ని క్లుప్తంగా విశ్లేషించి పట్టు సాధించాలని చెప్పారు. పురాణాల పట్ల మరియు ఇతిహాసాల పట్ల అవగహాన ఉండాలని వారు కోరారు. ప్రతి విద్యార్థి సమాయాన్ని వృధా కాకుండా చుడాలని చదువుకునే సమయాన ఎన్నో అటుపోట్లు ఉంటాయని వాటిని అధిగమించి ముందుకు పయనించాలనితెలిపారు.
విద్యతోపాటు వివిధ స్థాయిలలో నిర్వహింపబడే పలు పోటీపరీక్షల పట్ల ఆసక్తిని ప్రదర్శించాలని మరియు వాటిలో సంచలన విజయాలను నమోదు చేయాలని ఆకాక్షించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని తద్వారా ప్రశాంతత లభిస్తూందని చెప్పారు. చదువులో ఎదురయ్యే పలు సమస్యలను చాలా సులువుగా అధిగమించవచ్చని చెప్పారు. నిత్యం చదువులో నిమగ్నమైన మీరు తప్పనిసరిగా తల్లితండ్రుల సమక్షంలో పలు వినోదభరితమైన కార్యక్రమాలలో పాల్గొని ఉత్సహాతను రెట్టింపు చేసుకోవాలని కోరారు.
అల్ఫోర్స్ విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించడం చాలా గొప్ప విషయమని మరియు పర్యవేక్షణ చాలా అభినందనీయమని చెప్పారు. అన్ని వనరులను కల్పిస్తూ వారిని వివిధ స్థాయిలలో అత్యుత్తమంగా రాణించే విధంగా ప్రోత్సహాం అందించడం చాలా ప్రశంసనీయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర విద్య రంగానికే ఒక గొప్ప దిక్సూచిగా మారడం వారి శ్రమకు గొప్ప బహుమతని కితాబునిచ్చారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులకు అరోగ్యకరంగా ఉండాలని మరియు చదువులోని వివిధ విషయాలాను తెల్సుకోవాలని వాటకి సంబంధించిన వివిధ పోటి పరీక్షలలో పాల్గొని ఘనవిజయాలను నమోదు చేయాలని చెప్పారు. తల్లితండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశాలను వమ్ము కాకుండా చుడాలని వారు చేసే ప్రతి పని మీ కోసమేనని గుర్తుచేస్తూ ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా పలు పనులను ఎటువంటి వాయిదా లేకుండా త్వరగతిన చేయాలని సూచించారు.
మన విద్యాసంస్థల్లో విద్యార్థులకు కావల్సిన వనరులు అధికంగా కల్పిస్తూన్నామని చెప్పారు. అదే విధంగా వార్షిక ప్రణాళికలలో భాగంగా నిర్వహింపబడిన పలు పరీక్షలలో విజయం సాధించిన విద్యార్థులందరికి బహుమతులను ప్రదానం చేశారు.వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు నృత్యాలు, నాటికలు మరియు ఆలపించిన గేయాలు చాలా ఆకర్షించాయి. విద్యార్థులు చేసిన మైమ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.