కరీంనగర్, నిఘాన్యూస్:రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ కు విచ్చేసిన సీ.ఐ.ఎస్.ఎఫ్ బలగాలతో శనివారం నాడు గన్నేరువరం, వీణవంక పోలీసు స్టేషన్ ల పరిధిలో, గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా గుర్తించిన పలు సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ ఫ్లాగ్ మార్చ్ గన్నేరువరం, వీణవంక మండల కేంద్రాల్లో మరియు చల్లూరు గ్రామంలో నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ నందు సీ.ఐ.ఎస్.ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు మరియు స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీ.ఐ.ఎస్.ఎఫ్ సేవలు వినియోగించనున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్, కంపెనీ కమాండంట్ విక్రాంత్, అసిస్టెంట్ కమాండంట్ విజేందర్,సురేష్ ( ఆర్.ఐ. అడ్మిన్), వీణవంక ఎస్సై తోట తిరుపతి, గన్నేరువరం ఎస్సై తాండ్ర నరేష్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.