Tuesday, August 5, 2025

కేటీఆర్…. నీ సవాల్ కు నేను సిద్ధం

నేను ఓడిపోతే… రాజకీయ సన్యాసం తీసుకుంటా

నేను గెలిస్తే… బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా?

దమ్ముంటే నా సవాల్ కు స్పందించాలి

ప్రజాహిత యాత్రకు భారీగా తరలివచ్చిన జనం

కరీంనగర్ మార్చి (నిఘా న్యూస్ ) కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ది కోసం ఎవరేం చేశారో చర్చించేందుకు సిద్ధమా? అంటూ మాజీమంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ అభివ్రుద్ధితోపాటు తాను చేసిన పోరాటాలు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై కరీంనగర్ కమాన్ వేదికగా చర్చించేందుకు సిద్ధమన్నారు. తనతో చర్చించేందుకు కేసీఆర్ ను తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు ప్రతి సవాల్ విసిరారు. ‘‘కరీంనగర్ కు నేను చేసిన అభివ్రుద్ధితోపాటు రాముడి అంశంపైనా ఎన్నికల్లోకి వెళుతున్నా… నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఓడిపోతే హిందుత్వం, బీజేపీ గురించి మాట్లాడను. మరి నేను గెలిస్తే… బీఆర్ఎస్ పార్టీని మూసేసి ఫాంహౌజ్ కే పరిమితమైతారా?’’అటూ సవాల్ సంధించారు. రాముడి పేరు చెప్పుకుని ఆనాడు ఎన్టీఆర్ వద్ద ఎమ్మెల్యే టిక్కెట్ సంపాదించిన మీ అయ్య అదే రాముడి పేరున్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. ఇకపై తన గురించి మాట్లాడేటప్పుడు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలని, అడ్డగోలుగా మాట్లాడితే కరీంనగర్ లో అడుగు కూడా పెట్టనీయబోమని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాహిత యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం చొప్పదండి పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలు చల్లి, పటాకులు పేల్చి ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున ఎదురేగి మంగళహారతి పట్టి స్వాగతం పలికారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలతో కలిసి పట్టణంలో పాదయీత్ర చేసిన బండి సంజయ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చొప్పదండి గడ్డ అంటేనే దైర్యం ,సాహసానికి పెట్టింది పేరు అని అన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular