ప్రత్యేక ఫంక్షన్ హాళ్లలో ఏర్పాుట చేయాలి : కార్పొరేటర్ కమల్ జిత్ సింగ్
కరీంనగర్, నిఘా న్యూస్: త్వరలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఉపవాస దీక్షల సందర్భంగా కరీంనగర్ లో నోరూరించే హలీమ్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంటారు. ప్రతీ ఏడాది వీటిని ఏర్పాటు చేయడానికి ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకొని వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గతంలో కరీంనగర్ లోని బస్టాండ్ నుంచి గీతాభవన్ మార్గంలో ఆర్ట్స్ కళాశాల లైన్లో ఏర్పాటు చేసేవారు. కానీ ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో ఇక్కడ హలీమ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో గీతాభవన్ సరిహద్దులోని సర్కార్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఇక్కడా పార్క్ ఏర్పాటు చేయడంతో హలీమ్ సెంటర్లను నిర్వహించడం లేదు.
అయితే కొందరు అనుమతి తీసకోకుండానే హలీమ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. హలీమ్ సెంటర్ కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పాటు వంటకాల కారణంగా పొగ వస్తూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతారు. కానీ కొందరు నిర్వాహాకులు అవేమీ పట్టించుకోకుండా అనుమతులు లేకుండానే ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ లోని బస్టాండ్ నుంచి గీతాభవన్ మార్గంలో హలీమ్ సెంటర్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేకున్నా వీటి నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ సందర్భంగా 49 వ డివిజన్ కార్పొరేటర్ సోహాన్ కమల్ జిత్ కౌర్ మాట్లాడుతూ ప్రధాన మార్గంలో హలీమ్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, అందువల్ల వీటిని ప్రత్యేక సెంటర్లలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే కొందరు మున్సిపల్ అధికారును కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా హలీమ్ సెంటర్లపై వీటిని ఏర్పాటు చేయకుండా ప్రత్యేక ఫంక్షన్ హాళ్లలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.