కరీంనగర్ నిఘా న్యూస్: హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి మంగళవారం నాడు తనిఖీ చేసారు. ఈ సందర్బంగా ఆయన పలు రికార్డులు పరిశీలించారు. పెండింగ్ లో వున్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కమిషనరేట్ ఫిర్యాదుల కేంద్రం ద్వారా వచ్చే ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ త్వరితగతిన వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్బంగా ప్రస్తుతానికి కరీంనగర్ కమిషనరేట్ కు మంగళవారం నాడు కేంద్ర పారామిలటరీ సి ఐ ఎస్ ఎఫ్ బలగాలు రెండు కంపెనీలు కరీంనగర్ కు చేరుకున్నాయి. వీటిల్లో ఒక కంపెనీ ని హుజురాబాద్ కు కేటాయించగా మరొకటి కరీంనగర్ లో అందుబాటులో ఉంచారు.హుజురాబాద్ ఏసీపీ ఆఫీస్ తనిఖీ అనంతరం అక్కడే వున్న కేంద్ర బలగాల అధికారులతో కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ మాట్లాడారు.ఎన్నికల సందర్బంగా నిర్వహించాల్సిన విధులు , ఇక్కడి పరిస్థితులు , ఎదురయ్యే సవాళ్లు పై చర్చించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
సీఐఎస్ఎఫ్ బలగాలతో సమావేశం
రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్బంగా ప్రస్తుతానికి కరీంనగర్ కమిషనరేట్ కు మంగళవారం నాడు కేంద్ర పారామిలటరీ సి ఐ ఎస్ ఎఫ్ బలగాలు చేరుకోగా స్థానిక అంబేద్కర్ స్టేడియం లో వారికి బస కల్పించారు. వారితో కరీంనగర్ పోలీస్ కమీషనర్ మంగళవారం సమావేశమయ్యారు. ఎన్నికల సందర్బంగా నిర్వహించాల్సిన విధులు , ఇక్కడి పరిస్థితులు , ఎదురయ్యే సవాళ్లు పై చర్చించారు. . ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రానున్న ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలోకంపెనీ కమాండర్ విక్రాంత్ షాక్కిన్ , సూపర్వైసరీ అధికారి విజేందర్ , ఏసీపీ లు శ్రీనివాస్ (హుజురాబాద్) , ప్రతాప్ (ఏ.ఆర్ ), సరిలాల్ ఇన్స్పెక్టర్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.