కరీంనగర్ మార్చి 5(నిఘా న్యూస్): బీజేపీ కరీంనగర్ జిల్లా కార్యాలయ కార్యదర్శి మాడుగుల ప్రవీణ్ కుమార్ అకాల మృతి పట్లజిల్లా శాఖ సంతాపం వ్యక్తం చేసి, ఘన నివాళులు అర్పించింది . జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు హుజురాబాద్ పట్టణంలోని ప్రవీణ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహం పై పార్టీ పతాకాన్ని కప్పి అనంతరం అంతిమయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, నియమ నిబద్ధతతో భారతీయ జనతా పార్టీ కోసమే ప్రవీణ్ నిరంతరం కృషి చేశారని , ఆయన మృతి తీరని లోటన్నారు. ఇటీవల గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రవీణ్ , అకాల మరణం చెందడం విచారకరమన్నారు. జిల్లా పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు మనోధర్యాన్ని ప్రసాదించాలని , ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు మండల అధ్యక్షులు రాముల కుమార్, నల్ల సుమన్, గంగిశెట్టి ప్రభాకర్ , వేణు ,తుర్పాటి రాజు యాంసాని శశిధర్ ,వినయ్, చైతన్య రాజశేఖర్ , నగేష్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు
ప్రవీణ్ మృతి తీరని లోటు.. ఘన నివాళులు అర్పించిన బీజేపీ జిల్లా శాఖ
RELATED ARTICLES