కరీంనగర్, నిఘా న్యూస్:ఫెమిలైజేషన్ ఎక్ససైజ్ లో భాగంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు గత బుధవారం నాడు కరీంనగర్ కు చేరుకోగా, వారి ప్రణాళికలో భాగంగా శనివారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లోని పరేడ్ గ్రౌండ్ నందు డిఫెన్స్ అకాడమీ, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల విధులు, వారు ఉపయోగించే వాహనాలు, శాంతిభద్రతలు పెట్టే సమయంలో ఉపయోగించు రబ్బర్ బుల్లెట్లు, స్మోక్ గ్రనేడ్స్, షెల్స్, అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఉపయోగించే పరికరాలపై అవగాహన అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ విశ్వరంజన్ సాహూ, ఆర్ఐలు శ్రీధర్ రెడ్డి, సురేష్, ఇతర అధికారులు మరియు ఆర్ ఏ ఎఫ్ బలగాలకు చెందిన అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలపై అవగాహన..
RELATED ARTICLES