కరీంనగర్, నిఘా న్యూస్:ఖాతాదారులకు సకాలంలో డబ్బు చెల్లించకుండా, మోసగించి, చిట్ ఫండ్ కంపెనీ నందు వారు జమ చేసుకున్న డబ్బుతో సొంత ఆస్తులు కూడబెట్టిన కేసులో అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు, ఇద్దరు డైరెక్టర్లు అయిన సూర్యుని కొండలరావు ఉప్పల రాజేందర్ లను పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కరీంనగర్ సీతారాంపూర్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శ్రీరామ్ వెంకట్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 21వ తేదీన అరెస్టు కాబడి రిమాండ్ కు తరలించిన విషయం విధితమే. కేసుకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు నిందితుల ముగ్గురిని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు ఐదు రోజులు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా కరీంనగర్ రాజీవ్ చౌక్, కోతిరాంపూర్, జ్యోతి నగర్ లో గల అక్షర చిట్ ఫండ్ బ్రాంచీలలో తనిఖీలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను. కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు స్వాధీనపరచుకున్నారు.