Tuesday, August 5, 2025

ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి

సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నిఘా న్యూస్: మార్చి 3, 4, 5 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్క చిన్నారికి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాతతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పల్స్ పోలియో కార్యక్రమం 100% విజయవంతం అయ్యేలా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమంలో ఏ ఒక్క చిన్నారిని వదలకుండా అందరికీ పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో ఈ కార్యక్రమం పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

అందరి సహకారంతోనే కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు. జిల్లాలో 89,273 మంది 0-5 సంవత్సరాలలోపు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 545 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని, అర్బన్ ప్రాంతాల్లో 150 గ్రామీణ ప్రాంతాల్లో 395 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ తో పాటు పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమము అధిక శాతం విజయవంతం అయ్యేలా చూడాలని, దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, డిప్యూటీ వైద్యాధికారి జువేరియా, డి ఐ ఓ సాజిత హత హరి, డబ్ల్యుహెచ్ వో కన్సల్టెంట్ అధల్ నిగామె, డీ ఈవో జనార్దన్ రావు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సఖి అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి, డీఎం అండ్ హెచ్ ఓ డెమో రంగారెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular