అహ్మదాబాద్: వివిధ కార్యక్రమాలు, పథకాల ద్వారా సన్నకారు రైతుల జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. గ్రామీణ ఆర్థిక అభివృద్ధితోనే లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే గ్రామీణ వ్యవస్థ బలోపేతం కావాలన్నారు. గురువారం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ 50వ వార్షికోత్సవంలో ప్రధాన మోడీ ప్రసంగించారు. లక్ష మందికి పైగా రైతులు పాడిపశువులు పెంపకం దారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రఖ్యాత అమూల్ కంపెనీ నిర్వహిస్తున్న జి సి ఎం ఎఫ్ ని ప్రపంచంలో నెంబర్ వన్ డైరీ గా మార్చడానికి కృషి చేయాలని పాడి రైతులకు భాగస్వామపక్షాలకు మోడీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ సహకార సంఘం ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద డైరీ కంపెనీగా స్థానం దక్కించుకుందని తెలిపారు.
రైతుల జీవితాలను మెరుగుపరచడానికి కృషి
RELATED ARTICLES