విజయవాడ, నిఘాన్యూస్:తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు స్పష్టం చేశారు. పొత్తు గురించి త్వరలోనే ప్రకటన ఉంటుందన్నారు. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనేది చంద్రబాబు పవన్ నిర్ణయం తీసుకుంటారని, పొత్తులు పెట్టుకునే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవని అన్నారు. టికెట్లు కోల్పోయిన వాళ్లు బాధపడొద్దు అని అధినేతలు ఇద్దరు చెప్పారని గుర్తు చేశారు. టిడిపి, జనసేన మధ్య గొడవలు పెట్టేందుకు వైసిపి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వాలంటీర్ల గురించి మాట్లాడిన మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడగులు వేస్తున్న టిడిపి, జనసేన పార్టీ లు గురువారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. పొత్తును స్వాగతించిన టిడిపి జనసేన లీడర్లు అభినందిస్తూ ఒక తీర్మానం… మీడియాపై దాడులు తప్పు పడితే రెండో తీర్మానం సమన్వయ కమిటీ ఆమోదించింది..
టీడీపీ, జనసేనలు రెండు తీర్మానాలకు ఆమోదం..
RELATED ARTICLES