మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.. కానీ ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. శరీరానికి ప్రమాదకరమని తెలిసికూడా మద్యం సేవిస్తున్నారు. బీరు తాగడానికి యువత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా బీరు తాగడం వలన గ్లామర్ పెరుగుతుంది అంటారు. అందువల్ల ఈమధ్య బ్యూటీ కోసం కొంతమంది అమ్మాయిలు కూడా బీరు తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే బీరు తాగడమే కాకుండా ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల కూడా బోలేడన్ని ప్రయోజనాలు ఉన్నాయట. చర్మం నిగనిగలాడాలంటే.. అందమైన ముఖం సొంతం కావడానికి ప్రతిరోజు ముఖానికి బీర్ ఫేస్ ప్యాక్ చేసుకోవాలని అంటున్నారు. ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు మొటిమలు, నల్లటి మచ్చలతో బాధపడుతున్నారు. అలాంటివారు బీరులో ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం లో సైనింగ్ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇలా అప్లై చేసే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని మరికొందరు చెబుతున్నారు.