జమ్మికుంట: ఫిబ్రవరి 16( నిఘా న్యూస్) జమ్మికుంట రూరల్: నిరుపేద కుటుంబానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుండి జారీ పడిన ఘటన జమ్మికుంట మండలం పెద్ధంపల్లి లో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే రంగమ్మపల్లి గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు పెద్దంపల్లి తాటి వనంలో తాటి చెట్లు ఎక్కి జీవనం కొనసాగిస్తున్నాడు.ఎప్పటిలాగే తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ మోకుజారీ తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలు అయ్యాయి.అక్కడే ఉన్న తోటి గీత కార్మికులు హుటాహుటిన జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా కుడి కాలు విరగగా అక్కడి నుండి హన్మకొండలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ ను ఆదుకోవాలని తోటి గీత కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
తాటిచెట్టు పై నుండి పడి గీత కార్మికునికి గాయాలు..
RELATED ARTICLES