•పోటాపోటీగా కబ్జాలు,ఇంటి నిర్మాణాలు
•ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు
కరీంనగర్ (నిఘా న్యూస్):-లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు కొందరు కేటుగాళ్ళు.కాళీ జాగా కనిపిస్తే చాలు గద్దల్లా వచ్చి భూమిని మింగేస్తున్నారు.ఇంత జరుగుతున్నా అధికారుల చర్యలు మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. కరీంనగర్ కి కూతవేటు దూరంలో ఉన్న కమాన్ పూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 116లో గల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు పోటాపోటీగా జరుగుతున్నాయి.చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో భూ మాఫియా రాజ్యమేలుతుంది.గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మిగులు భూములు కబ్జాకు గురవుతున్నాయి.అక్కడి ప్రజాప్రతినిధులకు కొంత పైకం చెల్లిస్తే ఇల్లు నిర్మించుకునేందుకు గ్రీన్ సిగ్నేల్ ఇస్తారనే ఆరోపణలు ఉన్నాయి.స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే ఇల్లు లేని పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పుకొస్తారట..ఓ మతానికి చెందిన వారికి తమ ప్రార్థన మందిరం కోసం స్థలం కూడా కేటాయయించారట..ఇక ఎవరైనా కబ్జాల గురించి ప్రశ్నిస్తే ఆ మతస్థులను ఉసిగొల్పి వారిపైకి దౌర్జనానికి పంపుతారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కబ్జాలకు అధికారులు బీజం ఎప్పుడు వేస్తారో వేచి చూడాల్సిందే.