కుటుంబాన్ని పరామర్శించిన అడిషనల్ డిసిపి పరిపాలన సి.రాజు
కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ లోని సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన లింగారెడ్డి అనే ఎస్సై శుక్రవారం ఉదయం గుండె పోటుతో కరీంనగర్ లో తిరుమల నగర్ లోని తన ఇంట్లో మృతి చెందారు.కామారెడ్డి జిల్లా నుండి నిన్నటి గురువారమే బదిలీపై వచ్చి కరీంనగర్ సీసీఆర్బి లో విధులకు రిపోర్ట్ చేసారు.మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు ఉన్నారు.బాధలో ఉన్న కుటుంబ సభ్యులను కరీంనగర్ అడిషనల్ డిసిపి పరిపాలన సి. రాజు పరామర్శించారు. అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దని, అన్ని వేళలా పోలీస్ శాఖ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారితో పాటుగా, సీసీఆర్బి ఏసీపీ విజయకుమార్, హుజరాబాద్ ఏసిపి శ్రీనివాసులు, హుజురాబాద్రూరల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ పోలీస్ వెల్ఫేర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సైదాపూర్ మండల పోలీస్ స్టేషన్ ఎస్సై ఆరోగ్యం తోపాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.