కరీంనగర్, నిఘా న్యూస్: విద్యార్థిని కొట్టిన హుస్నాబాద్ పట్టణంలోని అల్ఫొర్స్ పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని ఆల్ఫొర్స్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లక్డికపుల్, హైదరాబాద్ లోని కమిషనర్, పాఠశాల విద్య గారికి టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పర్లపల్లి రవీందర్ మాట్లాడుతూ ధనార్జనే ధ్యేయంగా పాఠశాలను నడుపుతూ, విద్యార్థులను శారీరకంగా హింసిస్తున్న అల్పోర్స్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, ఇట్టి పాఠశాల పై చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలని రవీందర్ డిమాండ్ చేశారు.

కొద్ది రోజులు అధికారులు హడావిడి చేసి తరువాత ఇట్టి పాఠశాల పై చర్యలు తీసుకోకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు అని. ఇట్టి పాఠశాలలో జరిగిన ఘటన అనేక వార్హ దినపత్రికల్లో రావడం జరిగింది దీనిని సుమోటగా తీసుకొని చర్యలు తీసుకోవాలని అని రవీందర్ అన్నారు. ఇట్టి కళాశాల గుర్తింపు రద్దు అయ్యేవరకు TNSF పోరాటం చేస్తోంది అని అన్నారు..ఈ కార్యక్రమంలో TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి చీమ మహేష్, రాష్ట్ర కార్యదర్శి చౌట గణేష్, రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు..