చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు
కరీంనగర్ ఫిబ్రవరి 13( నిఘా న్యూస్):-కరీంనగర్ నగరంలో ఫుట్ పాత్ లపై వ్యాపారస్థుల దందా మళ్ళీ మొదలైంది.స్మార్ట్ సిటీగా పేరుగాంచిన కరీంనగర్ ఇప్పుడు సమస్యలకు నిలయంగా మారుతోంది.ఒక పక్క స్మార్ట్ సిటీ పేరుతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతుంటే మరోపక్క ఫుట్ పాత్ లను ఆక్రమిస్తూ పాదచారులకు దారి లేకుండా చేస్తున్నారు కొంతమంది వ్యాపారస్థులు..చర్యలు తీసుకోవాల్సిన అధికారులే నోరు మెదపకపోవడంతో ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయి.ఇటీవలే స్మార్ట్ సిటీలో భాగంగా 59వ డివిజన్ లో రోడ్డుకు ఇరువైపులా వేసిన రెలింగ్ ను కొందరు తమ వ్యాపారాల కోసం తొలగించారు.దింతో మీడియా ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికి చర్యలు తీసుకునేందుకు వెనకడుతున్నారు.
ఇదిలావుండగానగరంలో ఫుట్ పాత్ ఆక్రమణలు ప్రదానంగా కోర్టు చౌరస్తా నుంచి మొదలుకుని ఎస్సారార్ డిగ్రీ కాలేజ్ వరకు ఇరువైపులా పండ్ల దుకాణాలు దర్శనమిస్తున్నాయి.ఎస్ఆర్ఆర్ కాలేజ్ వద్ద డే టైం తోపాటు సాయంకాలం సమయంలో మిర్చి బండ్లు పెట్టి పుట్ పాత్ లను పూర్తిగా ఆక్రమిస్తున్నారు.అంతే కాకుండా ట్రాలీ ఆటోలను రోడ్లపై నిలిపి కూరగాయలు,పండ్లు అమ్ముతున్నారు.దీంతో పాదచారులకు మాత్రమే కాకుండా మెయిన్ రోడ్డులో ప్రయాణించే వారికి కూడా ఇబ్బందిగా మారింది.కరీంనగర్ స్మార్ట్ సిటీగా మారుతున్న క్రమంలో సుందరమైన రోడ్లు ఏర్పాటు చేసి అవి ప్రజలకు ఉపయోగపడే విదంగా ఉండాల్సిన రోడ్లు, పుట్ పాత్ లను వ్యాపారస్థులు ఆక్రమిస్తున్నారు.

గతంలో పుట్ పాత్ లపై వ్యాపారం చేస్తున్న నలుగురు మహిళలు కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం మన అందరికీ తెలిసిందే..ఆ ఘటనతో అప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ పలు విభగలతో కలసి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి పుట్ పాత్, రోడ్లను ఆక్రమించి వ్యాపారలు చేస్తున్న వారి దుకాణ సముదాయాలను తొలగిచే కార్యక్రమానికి మున్సిపల్ సిబ్బంది, పోలీసు శాఖ శ్రీకరం చుట్టారు. అంతలోనే అప్పుడున్న కమిషనర్ బదిలీపై వెళ్లడంతో ఈ ప్రత్యేక డ్రైవ్ మున్నాళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది.ఫుట్ పాత్ ఆక్రమణలపై ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి ఆక్రమణలు జరగకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.