వేములవాడ ఓల్డ్ అర్బన్ కాలనీ కి చెందిన యువకుడిగా గుర్తింపు
వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గెస్ట్ హౌజ్ పక్కన ఓ యువకుడిని హత్య చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. మృతుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణలోని 10వ వార్డ్ ఓల్డ్ అర్బన్ కాలనికి చెందిన కులుకుంట్ల శ్రీదర్ గా పోలీసులు గుర్తించారు. సోమవారం ఉదయం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని డీఎస్పీ నాగేంద్రచారి, పట్టణ సీఐ కరుణాకర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే శ్రీధర్ హత్య గురైనట్లు అనుమానిస్తున్నారు. మృతునికి భార్య భాగ్య రేఖ, కుమారుడు ఉన్నారు.