కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్
జమ్మికుంట: ఫిబ్రవరి 11( నిఘా న్యూస్) జమ్మికుంట:హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్దే నా ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం మండలంలోని సింగాపూర్ గ్రామంలోని వొడితల ప్రణవ్ స్వగృహాంలో ఏర్పాటు చేసిన అల్పాహర విందుకు ఎన్ఎన్ఐయుఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం మొదటిగా నియోజకవర్గానికి వచ్చిన బల్మూరి వెంకట్ కు వొడితల ప్రణవ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బల్మూరి వెంకట్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నహకరించాలని బల్మూరి వెంకట్ ను ఆయన కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని అనడానికి బల్మూరి వెంకట్ నిదర్శనమని అన్నారు. అతి చిన్న వయస్సులోనే వెంకట్ కు ఎమ్మెల్సీ వచ్చిందని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్సీ నిధులను మంజూరు చేయాలని బల్మూరి వెంకట్ ను ఆయన కోరారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని అపరభద్రాద్రిగా పేరుగాంచిన శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ది కోసం, జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్సీ బలమూరు వెంకట మాట్లాడుతూ… పెండింగ్ లో ఉన్న దళిత బంధు, కొత్త రేషన్ కార్డ్ లు, అరు గ్యారంటీ లను అమలు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ నిధుల నుండి 50 లక్షలు హుజురాబాద్ అభివృద్ధికి కేటాయిస్తానని తెలిపారు. హుజూరాబాద్ ను పి వి జిల్లా గా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. నియోజక వర్గం లో అక్రమం గా తరలిస్తున్న ఇసుకను అడ్డుకుంటామనీ అన్నారు. హుజూరాబాద్ ప్రజలకు వొడితల ప్రణవ్ అందుబాటులో ఉంటారని, నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకు ఆయన కృషి చేస్తారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు నేరుగా తన వద్దకు రావద్దని వొడితల ప్రణవ్ ద్వారానే సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం సింగాపూర్ నుండి హుజూరాబాద్ కు ర్యాలీగా బయలుదేరి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. పూజలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.