స్మార్ట్ సిటీలో వేసిన రెలింగ్ ను తొలగించిన వారిపై చర్యలేవి..?
కరీంనగర్ ఫిబ్రవరి 8 (నిఘా న్యూస్):- కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని ప్రధాన రహదారులను అన్ని హంగులతో తీర్చిదిద్దారు.రోడ్డు, డ్రైనేజీతో పాటు టైల్స్, రెయిలింగ్, వీధిలైట్లు, మొక్కలు నాటడం వంటి పనులు పూర్తి చేసి నగరాన్ని ఆకర్షణీయంగా మార్చారు.ఇక్కడి వరకు బాగానే ఉంది.ఆ తర్వాత ఏవి ఎక్కడ పోయిన తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది మున్సిపల్ అధికారులు..నగరంలోని 59వ డివిజన్ పరిధిలోని శివ టాకీస్ లేబర్ అడ్డా ఏరియాలో ఇటీవలే ఓ వైన్స్ షాప్ నిర్వాహకులు,ట్రూ వాల్యూ మారుతి సుజుకి నిర్వాహకులు తమ వ్యాపారాలకు అడ్డుగా ఉన్నాయని

స్మార్ట్ సిటీలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా వేసిన రిలింగ్ ను తొలగించి పర్మినెంట్ రూంలో పెట్టుకున్నారు.అయితే ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెల్లగా సానుకూలంగా స్పందించి అక్రమంగా రెలింగ్ ను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని
సంబంధిత ఇఇ కిష్టప్పకి ఆదేశించారు.కాగా రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా నిర్లక్ష్యం వహిస్తు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న ఇఇ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
