Monday, August 4, 2025

కరీంనగర్ లోని కార్పొరేట్ కళాశాల ఫీజుల దోపిడీ

  • ఇంటర్ బోర్డు నిర్ణయించిన ఫీజులు కాకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు

  •  చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు-అక్రమంగా వసూలు చేసిన ఫీజులనువిద్యార్థులకు తిరిగి చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్

కరీంనగర్ (నిఘా న్యూస్):తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా ప్రైవేట్ బడా కాలేజీలు ఇష్టా రెటీనా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను విద్యార్థులు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కళాశాల సొసైటీ పేరుతో నడుస్తున్నా ఫీజుల రశీదు మాత్రం నామ మాత్రంగా కళాశాల పేరుతో వుంటుంది. రశీదు పై కళాశాల కోడ్ కానీ, సొసైటీ రిజిస్ట్రేషన్ నంబరు కానీ ఎదీ లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నా ఇట్టి కార్పొరేట్ కళాశాల వారిని ప్రశ్నించే వారు లేకుండా పోయారు అని విద్యార్థుల తల్లిదండ్రులను వాపోతున్నారు.
ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రచారాలు నిర్వహించరాదని, లేదా బోర్డ్ అనుమతులు తీసుకోవాలి అని వున్నా, అందుకు విరుద్ధంగా పెద్ద పెద్ద హోర్దింగ్ లతో ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థులను, వారి తల్లిదడ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా, ఇట్టి విషయం ఇంటర్మీడియట్ అధికారుల దృష్టికి వచ్చినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.

అనుమతులు లేకుండా హాస్టళ్లు నడుపుతూ వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా ఇంటర్ బోర్డు అధికారులు మా పరిధిలోకి రాదు అని చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా తప్పుడు రశీదులతో కోట్ల రూపాయల ఆర్థిక దోపిడీ చేస్తున్నా ఇట్టి కళాశాలల పై ఐటి,ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించాలి, డే స్కాలర్ అయితే 55,000 వేల నుండి లక్ష రూపాయల వరకు, అదే రెసిడెన్షియల్ అయితే లక్ష యాభై వేల నుండి రెండు లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అసలు కళాశాల ప్రాంగణం లో హాస్టల్ నిర్వహించారు అని అధికారులు చెబుతున్నా ఇట్టి కళాశాల పై మాత్రం తనిఖీలు నిర్వహించారు. కొస మెరుపు ఏంటంటే సదురు కళాశాల వారు ఇచ్చే రశీదు పై ఫీజు వాపస్ చేయబడదు అని వుంటుంది.కానీ ఇది విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధం. పరీక్షలు ముందు ఫీజులు కట్టాలి అని విద్యార్థులపై వొత్తిడి తీస్తూ మానసిక వొత్తిడి కి గురి చేస్తున్నారు. ఇట్టి కళాశాల అకాడమీల పేరుతో మరో మోసానికి ఆర్ధిక దోపిడీకి రంగం సిద్ధం చేసింది, ఇప్పటికైనా ఇట్టి కళాశాల పై అధికారులు చర్యలు తీసుకొని, వసూలు చేసిన అధిక ఫీజులు వెంటనే విద్యార్థులకు చెల్లించాలి అని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular