వేములవాడ ప్రతినిధి ( నిఘా న్యూస్ ):మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తిచేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు . వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో చేపట్టే మహా శివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆలయ ఓపెన్ స్లాబ్ లో మంగళవారం జాతర సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై చర్చించారు,అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ వచ్చే మార్చి 7,8,9 తేదీల లో జరిగే మహా శివరాత్రి జాతర కు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలని, శానిటేషన్,త్రాగు నీరు,క్యు లైన్ లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా భక్తి భావంతో స్వామి వారిని దర్శించుకునే సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని,అలాగే విఐపి బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని,దీంతో కొంత భక్తులకు సౌకర్యంగా ఇబ్బందులు కలుగకుండా వుంటుందని అధికారులకు సూచించారు. జాతర సమయానికంటే ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలోజిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా , ఎస్పి అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, టైని ఐపిఎస్ రాహుల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి,ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్,వేములవాడ ఆర్డీఓ మధు సూదన్ , డీఎస్పీ నాగేంద్ర చారి తో పాటు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు…
మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి
RELATED ARTICLES