Sunday, August 3, 2025

ప్లాస్టిక్ రహిత మేడారం కోసం ప్రజలు సహకరించాలి..

-తెలంగాణ రాష్ట్ర డిజిపి రవికుమార్ గుప్త ఐపీఎస్.

భద్రాద్రి కొత్తగూడెం,నిఘా న్యూస్: ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన సేవ్ మేడారం క్లీన్ మేడారం క్లీన్ మేడారం సే నోటు ప్లాస్టిక్ గోడపత్రికలను ప్రపంచ పర్యావరణ సంస్థ గ్లోబల్ చైర్మన్ డాక్టర్ హరి ఇప్పనపల్లి , తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్తా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సిహెచ్ భద్ర, కోనేటి నిఖిల్ సాయి సంస్థ ప్రతినిధి రామలింగారెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయం హైదరాబాదులో అనంతరం డిజిపి మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ సంస్థ గత 12 సంవత్సరాలుగా చేస్తున్న కృషిని అభినందించారు రెండు కోట్ల మంది మేడారం మహా జాతరలో అతి గొప్ప మహా జాతర భక్తులందరూ మేడారం మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్న జీవవైవిద్యాన్ని జీవులను వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తురాలు మీద భక్తుడు మీద ఉంది ఈ జాతరలో విచ్చలవిడిగా కాలుష్యాన్ని విడుదల చేయకుండా ప్లాస్టిక్ ని విచ్చలవిడిగా భారీ ఎక్కడ పడితే అక్కడ పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు పోలీస్ శాఖ తరపు నుంచి డిజిపి రవికుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గ్లోబల్ చైర్మన్ డాక్టర్ హర పల్లి మాట్లాడుతూ ముందు పెళ్లి అడుగులేని విధంగా మేడారం జాతరలో పసుపు కుంకుమలు మొదలుకొని అమ్మవార్లకు సమర్పించే బెల్లం వరకు పూర్తిగా విష రసాయనాలు వాడుతూ మేడారంలో జీవవైద్యం పూర్తిగా దెబ్బతీస్తున్నారు జంపన్న వాగులో పూర్తిగా సభ్యులను డిటర్జెంట్లు షాంపులను విరివిరిగా వాడుతూ మేడారం భూమి స్థారవంతాన్ని దెబ్బతీస్తున్నారు ఇప్పటికైనా మేడారం భక్తులు వనదేవతల్ని కాపాడుకోవడానికి ప్రపంచ పర్యావరణ సంస్థతో కలిసి రావాలని అందుకోసం అమెరికా నుంచి బయలుదేరి వచ్చానని ఈ సందర్భంగా హరి పేర్కొన్నారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భద్రా, నిఖిల్ మాట్లాడుతూ మేడారం మహా జాతర సందర్భంగా కనీసం లక్ష క్లాత్ బ్యాగులు పంచాలని తమ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది మేడారం జాతరలో ఫ్లెక్సీలను పూర్తిగా నివారించి కాలుష్యరైత మేడారం జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించి జాతరలో ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిలను ప్లాస్టిక్ కవర్లను సాధ్యమైనంతవరకు భక్తులను పోలీస్ శాఖ వారు ప్రభుత్వంలోని అన్ని విభాగాల వారు ఎవరికివారు స్వచ్ఛందంగా ఈ మేడారం మహా జాతర కాలుష్య రహితంగా పర్యావరణహితంగా భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ప్రపంచ పర్యావరణ సంస్థ అభిప్రాయపడింది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular