సంగారెడ్డి ప్రతినిధి (నిఘా న్యూస్) అదనపు శానిటరీ ఇన్స్పెక్టర్ విజయబాబుని ఉద్యోగం నుంచి తొలగించాలని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే విధులు బహిష్కరిస్తామని శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపల్ లో అక్రమాలకు పాల్పడుతూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కార్మికులను అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించి కొత్త వారిని తీసుకుంటున్న శానిటరీ ఇన్స్పెక్టర్ విజయబాబుని ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన అన్నారు ఈ పెద్ద సారు ఉద్యోగాల పేరు మీద లక్షల రూపాయలు తీసుకొని కొంతమందిని పేరు ఎక్కించుకోవడం జరుగుతోంది అనేక సంవత్సరాల నుండి ఈ మున్సిపాలిటీలో పనిచేస్తూ వారిని ఉద్యోగాల నుంచి తొలగించి కొత్తవారిని తీసుకోవడం చాలా దారుణం అని అన్నారు ఇలాంటి శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటే కార్మికులకు నష్టం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి విజయ్ బాబు ని ఉద్యోగం నుంచి తొలగించాలని అన్నారు ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం చాలా దారుణం అని అన్నారు అటెండెన్స్ పేరు మీద హాజరికి రాకపోతే కొన్ని డబ్బులు ఇస్తే అటెండెన్స్ చేస్తామని అంటున్నారు పేరుకే జిల్లా కేంద్రం తప్ప కార్మికులకు మాత్రం వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే అదనపు శానిటరీ ఇన్స్పెక్టర్ విజయబాబుని ఉద్యోగాలు తొలగించకపోతే విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారం స్పందించి సాయంత్రం ఇన్స్పెక్టర్ విజయ్ బాబుని తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున విధులు బహిష్కరిస్తామని అన్నారుఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకురాలు సువర్ణ రాజు జనార్దన్ సంగమేశ్వర్ యాదగిరి నర్సింలు సంగీత సుజాత మంజుల తదితరులు పాల్గొన్నారు
శానిటరీ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేయాలని రిలే నిరాహార దీక్ష
RELATED ARTICLES