కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్
కరీంనగర్, నిఘా న్యూస్: పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా, ఎన్నికల కోడ్ వెలువడినందున అక్రమ డబ్బు, మద్యం సరఫరా అరికట్టేందుకు కరీంనగర్ లోని పలుచోట్ల నిర్వహించిన వాహన తనిఖీల్లో సరైన ఆధారాలులేని 88,49,000 రూపాయలను పట్టుకుని స్వాధీన పరుచుకున్నామని కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని రాజీవ్ చౌక్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో కరీంనగర్ అశోక్ నగర్ కు చెందిన ఉప్పుల రాఘవ చారి, తండ్రి కుమారస్వామి , హౌసింగ్ బోర్డు కాలనీ కి చెందిన సూరోజు రమేష్, తండ్రి రాజా రత్నం ల నుండి 71,00,000 రూపాయలు పట్టుబడగా,కరీంనగర్ టూ టౌన్ పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో కరీంనగర్ అశోక్ నగర్ కు చెందిన అంకిత్ తివారి, తండ్రి గజధర్ వయసు 20 సంవత్సరాలు, వద్ద నుండి 2,60,000 రూపాయలు పట్టుబడగా, గీతాభవన్ చౌరస్తా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో కరీంనగర్ సుభాష్ నగర్ కు చెందిన దామెర అరుణ్ కుమార్, తండ్రి బాలయ్య నుండి 14,89,000 రూపాయలు పట్టుబడగా మొత్తం డబ్బును స్వాధీన పరుచుకుని తదుపరి ప్రక్రియకు సంబంధిత అధికారుల వద్దకు తరలించామని టౌన్ ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జె.సరిలాల్, కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ లతో పాటు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.