- 30 ఏళ్లుగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్
- ఆర్డీవో హెచ్చరించినా స్పందించని రిజిస్ట్రేషన్ల శాఖ
- లోకాయుక్త ఆదేశాలతో కదిలిన కరీంనగర్ కలెక్టర్
- సీలింగ్ భూముల్లో 460 పట్టాల రద్దుకు ఆదేశాలు
- చేతులు మారిన రూ.వందల కోట్లు
కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లాలో డాక్యుమెంట్ల రద్దు చర్చనీయాంశంగా మారింది. లోకాయుక్త స్పందించడం తో కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 460 పట్టాలు కలెక్టర్ ఆదేశాలతో రద్దుకానున్నాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని 20 ఎకరాల సీలింగ్ భూముల్లో ఇంతవరకూ జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలన్న లోకాయుక్త ఆదేశాలను కలెక్టర్ పమేలా సత్పతి అమలు చేశారు. వివాదాస్పద భూముల్లో లాంటి రిజిస్ట్రేషన్లు ఉండరాదన్న లోకాయుక్త ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయ న్నారు. దీంతో రూ.వందల కోట్ల మేర ఇప్పటికే పలువురు చేతులు మారిన ఈ భూములు త్వరలో ప్రభుత్వ పరం కానున్నాయి. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ల శాఖకు చెరపలేని మరకే కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయానికి ఆ స్థలంలో భూములు కొన్న అమాయకులు రోడ్డునపడే దుస్థితికి తీసుకువచ్చింది.
ఇలా జరిగింది…
కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 175,197,198 సర్వే నంబర్లలో దాదాపు 20 ఎకరాల భూమిని ల్యాండ్ సిలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకుంది. 1995 లో ఈ భూములు దుర్వినియోగo అవుతున్నాయని. విచారణ జరపాలని అప్పటి హైకోర్టు జిల్లా కలెక్టర్ ఆదేశించింది. విచారణ చేసిన కలెక్టర్ ఆ భూములు సీలింగ్ పరిధిలో ఉన్నాయని, వాటిపై ఎలాంటి లావాదేవీలు చేయరాదని ఆదేశించారు. కలెక్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. పలువురు హైకోర్టును ఆశ్రయిం చారు. మరోవైపు ఈ భూముల్లో ఆక్రమ లావాదేవీలు మాత్రం ఆగలేదు. అప్పట్లో దివంగత లోక్ సత్తా శ్రీనివాస్ ఈ భూముల పరిరక్షణకు పోరాటం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లను వ్యతిరేకిస్తూ లోక్న తాను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన లోక్ సత్తా సర్వే నంబర్లు 175,197,198లో జరిగిన లావాదేవీలు సమర్పించాలని రెవెన్యూశాఖను ఆదేశించింది. దీంతో ఆ వివరాలను రెవెన్యూ అధికారు లు సమర్పించారు. అంతేకాకుండా ఆ భూముల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేపట్టవద్దని రెవెన్యూ శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ల శాఖను 1998 నుంచి 2023 వరకు మొత్తం ఎనిమిది సార్లు ఆదేశించినట్లు సమా చారం. అయితే, కరోనా సమయంలో ఈ వ్యవ హారంపై పోరాటం చేస్తున్న లోకసత్తా శ్రీనివాస్ మరణించడంతో కేసు నీరుగారిందనుకున్న పలువురు ఆ భూముల్లో తిరిగి రిజిస్ట్రేషన్లను పున ప్రారంభించారు. రెవెన్యూశాఖ ఆదేశాలను ధిక్క రిస్తూ.. కొందరు అవినీతి అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడం ఆరంభించారు.
సామాన్యుల గురించి ఆలోచించాలి..
కొత్తపల్లిలోని 175,197,198 సర్వే నంబర్లలో భూముల రిజిస్ట్రేషన్ రద్దు నిర్ణయాన్ని కలెక్టర్ వున రాలోచించాలి. అనేక సామాన్య కుటుంబాలు తెలియక కొనుగోలు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి కొన్న సామాన్యుల గురించి ఆలోచించాలి. ఎలాంటి నోటీ సులివ్వకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సహేతుకం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి సామాన్యులకు న్యాయం చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.
డాక్యుమెంట్లు రద్దు చేస్తాం
-అఫ్టల్ఫాన్,సబ్ రిజిస్ట్రార్, గంగాధర
కొత్తపల్లి మండలంలో ల్యాండ్ సీలింగ్ లో ఉన్న భూములకు సంబంధించి అక్రమ రిజి స్టేషన్లు రద్దు చేయాలని రెండురోజుల క్రితం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 460కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అధికారుల సూచనలు పాటించి రెవెన్యూ అధికారు లకు సమాచారం ఇచ్చి రిజి స్టేషన్లు రద్దు చేస్తాం. -అఫ్టల్ఫాన్,