స్కూటీని లో 14 మంది తొలగింపు
నామినేషన్ ఉపసంహరించుకున్న 7 మంది అభ్యర్థులు
సంగారెడ్డి (నిఘా న్యూస్): జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొత్తం 7 సెగ్మెంట్ల పరిధిలో 16,40, 755 మంది ఓటర్లు ఉన్నారన్నారు పురుషులు 8,01,563, మహిళలు 8,39,133, ఇతరులు 59 మంది ఓటర్లుమే 13న పోలింగ్,* జూన్ 4న ఫలితాలు విడుదల కనున్నావని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈ నెల 25వ తేదీతో ముగిసిందన్నారు. మొత్తం జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 68 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలనలో 18 నామినేషన్లు తిరష్కరణకు గురి అయ్యాయి. దీంతో ఎన్నికల బరిలో మొత్తం 26 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే ఈ నెల 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు కాగా 7 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు మిగిలారన్నారు. జాతీయపార్టీల అభ్యర్థులు ముగ్గురు ఉండగా 6 మంది వివిధ రిజిస్టర్డు పార్టీ నాయకులు 10 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచారన్నారు.జహీరాబాద్ పార్లమెంట్ బరిలో ఉన్న అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్, బీజేపీ పార్టీ నుంచి బీబీ పాటిల్, కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ కుమార్ షెట్కార్, తెలంగాణ ప్రజా శక్తి పార్టీ నుంచి కొత్త బలిజ బస్వరాజ్, ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ నుంచి గుర్రపు మశ్చేందర్, అలియన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిపామ్స్ పార్టీ నుంచి చావగని మని, ధర్మ సమాజ్ పార్టీ నుంచి టీడీఎస్ మని, ఫిరామిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మాలెపు మోహన్ రెడ్డి, ఇండియా ప్రజాబందు పార్టీ నుంచి రోమాల బాబు దుర్గయ్యలు పోటీలో ఉన్నారు. వారితో పాటుగా స్వతంత్ర అభ్యర్థులుగా తలారి అశోక్, కమ్మరి నందీశ్వర్, జదావత్ జైపాల్ నాయక్, మహ్మద్ సద్దాం, మఠం మహదేవ్ స్వామి, బి.మారుతిరావు, ఎం.డి.యాకబ్ షరీఫ్, సజ్జాపూర్ రమేష్, ఎస్.రాజు, కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ లు బరిలో నిలిచారన్నారు .
జహీరాబాద్ పార్లమెంట్ కు 16,40,755 మంది ఓటర్లు..
జహీరాబాద్ పార్లమెంట్ ఏడు సెగ్మెంట్లలో ఈనెల 23వ తేదీ నాటికి 16, 40, 755 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 8,01,563 మంది, మహిళలు 8,39,133 మంది, ఇతరులు 59 మంది ఓటర్లు ఉన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో 2,02,769 మంది ఓటర్లు ఉండగా పురుషులు 99,474 మంది, మహిళలు 1,03,286 మంది, ఇతరులు 9 మంది ఉన్నారు. భాన్స్ వాడ నియోజకవర్గంలో 1,96,691 మంది ఓటర్లు ఉండగా అందులో 93,688 మంది పురుషులు, 1,02,990 మంది మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2,23,009 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,06,876 మంది, మహిళలు 1,16,131 మంది, ఇతరులు 2 ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 2,54,626 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,22,306 మంది, మహిళలు 1,32,301 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2,37,241 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,18,859 మంది, మహిళలు 1, 18, 373 మంది. ఇతరులు 9 మంది ఉన్నారు. అందోల్ నియోజకవర్గంలో 2,05,857 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,22,666 మంది, మహిళలు 1,28,186 మంది, ఇతరులు 5 మంది ఉన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 2,75,562 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,37,694 మంది, మహిళలు 1,37,866 మంది, ఇతరులు 2 ఉన్నారు.మే 13వ తేదీన పోలింగ్..జూన్ 4న ఫలితాలు రానిన్నవని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. 13వ తేదీన ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి ఉదయం 7.00 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ జరుగనున్నదన్నారు. అదే విధంగా ఓటర్లు ఏమైనా సమస్యలు పరిష్కారం కోసం, పిర్యాదులకు సీ-విజిల్ యాప్ తీసుకువచ్చారు. వాటితో పాటుగా కలెక్టరేట్ లో 1950 ఓటర్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు.దానితో పాటుగా ఓటర్లను ప్రలోభపెడితే కూడా ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. అంతే కాకుండా సువధ యాప్ ను ఎన్నికల కమీషన్ తీసుకువచ్చిందన్నారు. దీంతో పాటుగా దివ్యాంగులు, ముసలివాళ్ల కోసం సాక్ష్యం యాప్ తీసుకువచ్చామన్నారు. ఈ యాప్ ద్వారా వీల్ చైర్ కావాలన్నా, సహాయకులు కావాలన్నా ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఇంటి వద్ద నుంచి ఓటు వేసే సౌకర్యాన్ని కూడా వీరికి కల్పించారన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.