కరీంనగర్ జిల్లా నిఘా న్యూస్ :డ్రైవర్లలో ఆత్మస్థైర్యం నింపేందుకే డ్రైవర్స్ డే నిర్వహిస్తున్నారని,ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు డ్రైవర్స్ డే సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లకు స్పెషల్ విష్ తెలిపారు.ఈ సందర్భంగా తన ట్వీట్ లో సజ్జనార్ ఇలా రాసుకొ చ్చారు. ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవరన్నలది క్రియాశీల పాత్ర. వారి సేఫ్ డ్రైవింగ్ వల్ల టీఎస్ ఆర్టీసీ క్షేమంగా నడుస్తుందన్నారు.డైవర్ల వలనే.. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చుతు న్నారు. నిబద్ధత, క్రమ శిక్ష ణతో పాటు ఓపిక, సహనం తో విధులు నిర్వర్తిస్తూ.. తెలంగాణ ఆర్టీసిని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దు తున్న డ్రైవరన్నలకు.. డ్రైవర్స్ డే శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.
అలాగే డ్రైవర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97 డిపోల పరిధిలో ఉన్న డ్రైవ్లర్లను ఘనంగా సన్మానిస్తోందని ఎండీ సజ్జనార్ తెలిపారు.