కరీంనగర్, నిఘా న్యూస్: రాగంపేట గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న సింగసాని మల్లేశ్ కు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకుడిగా మల్లయ్య పేరు మీద విశ్వాసం పెరిగింది. గ్రామానికి శుద్ధి నీరు, రహదారులు, లైటింగ్ వంటి ప్రాథమిక సదుపాయాల కోసం ఆయన చేసిన పోరాటం ప్రజలను ఆకట్టుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొందరు డబ్బు, మద్యం ఎర చూపుతున్నా.. సింగసాని మల్లేశ్ మాత్రం మానవతా దృక్ఫథంతో ముందుకు వెళ్తున్నారు. ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ముందుండి తోడ్పడే మానవతావాది మల్లయ్య. గ్రామ ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే వ్యక్తి మల్లేశన్న భావనతో ప్రజలు ఏకమవుతున్నారు.
గతంలో చేసిన సేవల వల్ల యువతలో ఆయనపై విపరీతమైన ఆదరణ ఏర్పడింది. గ్రామంలో పారదర్శక పాలన, అవినీతి రహిత పరిపాలన అందిస్తానని ఇచ్చిన మాట ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తోంది. రైతుల సమస్యలపై ఎప్పుడూ గళం వినిపించిన అభ్యర్థి మల్లయ్య. పేదలకు అండగా, అవసరమైనప్పుడు తోడుగా నిలిచే వ్యక్తిత్వం ఆయనను మరింత ప్రజాదరణ పొందేలా చేసింది.రాగంపేట భవిష్యత్తును మార్చగల నాయకుడిగా ప్రజలు మల్లయ్యను చూస్తున్నారు.అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిగా ఆయనకు గ్రామ పెద్దలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు.అవకాశం ఇస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్న మాట ప్రజల్లో ఆశ నింపుతోంది.
విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులపై ఆయన ప్రణాళికలు గ్రామంలో మంచి చర్చకు దారితీశాయి. సింగసాని మల్లేశ్ ఎన్నికల ప్రచారానికి యూత్, మహిళలు, వృద్ధులు సమానంగా స్పందిస్తున్నారు. గ్రామ సమస్యలను రాజకీయాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత బాధ్యతగా చూసే నాయకుడే మల్లయ్య అని ప్రజలు అంటున్నారు. అభివృద్ధికి ఓటు వేయాలంటే మల్లయ్యకే ఇవ్వాలి అన్న జోష్ రాగంపేటలో కనిపిస్తోంది.గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఆయనకు మద్దతుగా ఏకతాటిపైకి వస్తున్నారు.మల్లయ్య గెలిస్తే గ్రామానికి కొత్త ఊపు వస్తుందని ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది.మంచి పని చేసే నాయకుడే కావాలన్న ప్రజల ఆశలకు సింగసాని మల్లేశ్ నే సరైన ఎంపికగా మారారు.అందుకే ఈ సారికి రిమోట్ గుర్తుకు ఓటు వేసి రాగంపేట సర్పంచ్ పదవి మల్లయ్యదే కావాలని గ్రామం అంతా గట్టిగా చెబుతోంది.


