ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు అంజయ్య ఫిర్యాదుతో కదిలిన అధికార యంత్రాంగం
కరీంనగర్ రూరల్ నిఘా న్యూస్-: కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలోని పెద్ద చెరువును గ్రానైట్ ఫ్యాక్టరీల వ్యర్థల భారిన నుండి కాపడలంటూ గ్రామనికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నిమ్మల అంజయ్య ఇటీవల గనుల భూగర్భ శాఖ అధికారులకు (హైదరాబాద్)లో ఫిర్యాదు చేశారు.అంజయ్య ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులతో ఆదేశాలు వచ్చాయి.గురువారం మోకపైకి వచ్చిన అధికారులు గ్రామస్తులతో కలిసి చెరువును సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు అధికారులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు..తమకు జీవనాధారం అయిన పెద్ద చెరువుకి పక్కనే వెలసిన కొన్ని గ్రానైట్ ఫ్యాక్టరీలు చెరువులో డస్ట్,కెమికల్స్ వేస్తూ నీటిని కలుషుతం చేస్తున్నారని చెప్పారు.దింతో చెరువులో ఉన్న చేపలు చనిపోతున్నాయని,డస్ట్ కుప్పలు చెరువులో పోయడంతో రైతులకు పంట పొలాలకు వెళ్లాల్సిన నీరు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.దింతో అటు మత్స్యకారులకు ఇటు రైతులకు లక్షల రూపాయలు నష్టం జరుగుతుందన్నారు.ఇప్పటికే గ్రానైట్ ఫ్యాక్టరీల వ్యర్థలతో చెరువు విస్తీర్ణం ఆక్రమణకు గురవుతుందని,మరి కొన్ని రోజులు గడిస్తే పెద్ద చెరువుకు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు చెప్పారు.కావున సంబంధిత అధికారులు సమన్వయంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి చెరువులో గ్రానైట్ వ్యర్థలు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుని ఎలగందుల పెద్ద చెరువును కాపాడాలని అధికారులను కోరారు.
ఆదేశాలు జారీ చేసిన హాజరుకాని అధికారులు..
ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు అంజయ్య ఫిర్యాదు మేరకు భూగర్భ గనుల శాఖ, పొల్యూషన్, మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు కొత్తపల్లి తహశీల్దార్ ఈ నాలుగు శాఖల అధికారుల సమన్వయంతో చెరువు ప్రాంతాన్ని సందర్శించాల్సి ఉంటుంది.కానీ భూగర్భ గనుల శాఖ, మత్స్యశాఖ అధికారులు మాత్రమే మోక మీదకు వెళ్లి చేతులు దులుపుకొన్నారు.రెవెన్యూశాఖ, పొల్యూషన్ అధికారులు హాజరు కాకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు.